Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakashamaa Aalakinchumaa Maatalaadedan

ఆకాశమా ఆలకించుమా మాటలాడెదన్

Aakashamaa Aalakinchumaa Maatalaadedan

Chorus
ఆకాశమా! ఆలకించుమా - మాటలాడెదన్
యెహోవా వంతు ఆయన జనమేగదా
యాకోబే స్వాస్థ్యభాగము
Verse
అరణ్య ప్రదేశంబుల యందున
భీకరధ్వనిగల యెడారిలో వాని కనుగొనెను
ఆవరించి వాని పరామర్శించి గాచె కనుపాపగా
Verse
యెహోవాయే వాని నడిపించెను
భూమియొక్క ఉన్నతస్థలముల మీద వాని నెక్కించి
అన్య దేవతలతో నేదైనను లేకపోయె వానిలో
Verse
లేచి వెళ్ళుమనే బేతేలునకు
దేవునికి బలిపీఠమచ్చట కట్టుమని సెలవియ్యగా
అన్యదేవతల పారవేయుమని తనవారితో చెప్పెన్
Verse
తిరిగి బేతేలులో దర్శన మిచ్చెను
దీవించి నీ పేరు ఇశ్రాయేలుగా నెల్లప్పుడుండుననెను
తన యింటికి వచ్చువారి నెల్ల ప్రభుదీవించు నీరీతిన్
Verse
ప్రభుని రాకడ సమీపమంచును
సమాజముగా కూడుట మరువక మరియు మీరు మానక
ప్రభుని యింటి దీవెన లెల్ల పొందుడి నిక్కముగా

Related Tags

WorshipGodBible