Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aakashambu Bhoomiyu Anthata Cheekati Yaa

ఆకాశంబు భూమియు అంతట చీకటి యా

Aakashambu Bhoomiyu Anthata Cheekati Yaa

Lyricist: A Charles Kinsinger
Verse
ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి
సమయమున ప్రార్థన చేతుము మా దేవా‖ దేవా ‖
Verse
చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా
ప్రభువా గావుము గావుము నీ నీడన్‖ నీడన్ ‖
Verse
చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే
గొలిచి నిద్రించున్‖ నిద్రించున్ ‖
Verse
చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా
చెన్నుగ యేసూగావుమా‖ యేసూగావుమా ‖
Verse
నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి
విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్‖ దేవప్రయాణికులన్ ‖
Verse
రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును
గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా‖ మాదేవా ‖
Verse
తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్
మేల్కొల్పుము నా ప్రియతండ్రి‖ ప్రియతండ్రి ‖
Verse
జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము
నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్‖ ఆమెన్ ‖

Related Tags

ProtectionEvening Prayer