Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aalayamlo Praveshinchandi

ఆలయంలో ప్రవేశించండి

Aalayamlo Praveshinchandi

Lyricist: Judson Paul Christopher
Verse
ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం‖ ఆలయంలో ‖
Verse
దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమానందం హల్లెలూయా‖ ఆలయంలో ‖
Verse
ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా‖ ఆలయంలో ‖

Related Tags

WorshipPrayerEncouragement