Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aalinchu Devaa Naa Manavula Naalinchu Da

ఆలించు దేవా నా మనవుల నాలించు ద

Aalinchu Devaa Naa Manavula Naalinchu Da

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ
యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ‖ ఆలించు ‖
Verse
సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు
నెల్లప్పుడు నాలించు‖ నాలించు ‖
Verse
పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి
కాసంతైన నాలించు‖ నాలించు ‖
Verse
నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ
సుతుని కృతమున నాలించు‖ నాలించు ‖
Verse
నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ
డించు మనిశంబు నాలించు‖ నాలించు ‖
Verse
నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను
కృపచే నాలించు‖ నాలించు ‖

Related Tags

GracePrayer