Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aananda Yaathra

ఆనంద యాత్ర

Aananda Yaathra

Lyricist: Hosanna Ministries
Verse
ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర‖ ఆనంద యాత్ర ‖
Verse
యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను‖ 2x ‖
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును‖ 2x ఆనంద యాత్ర ‖
Verse
రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా‖ 2x ‖
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా‖ 2x ఆనంద యాత్ర ‖
Verse
కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను‖ 2x ‖
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము‖ 2x ఆనంద యాత్ర ‖
Verse
ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం‖ ఆనంద యాత్ర ‖

Related Tags

PraiseSpiritual Journey