Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aanandam Neelone

ఆనందం నీలోనే

Aanandam Neelone

Lyricist: Hosanna Ministries
Verse
ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను – ప్రేమించినావు
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై‖ ఆనందం ‖
Verse
పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా‖ 2x ‖
కలవరాల కోటలో – కన్నీటి బాటలో‖ 2x ‖
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా‖ ఆనందం ‖
Verse
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని‖ 2x ‖
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా‖ 2x ‖
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే – జీవవాక్యమే‖ ఆనందం ‖
Verse
సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై‖ 2x ‖
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక‖ 2x ‖
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం‖ ఆనందం ‖

Related Tags

PraiseWorshipDevotional