Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aanandame Paramaanandame

ఆనందమే పరమానందమే

Aanandame Paramaanandame

Lyricist: Hosanna Ministries
Verse
ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో‖ 2x ‖
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము‖ 2x ఆనందమే ‖
Verse
పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే‖ 2x ‖
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే‖ 2x ఆనందమే ‖
Verse
గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను‖ 2x ‖
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే‖ 2x ఆనందమే ‖
Verse
నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు‖ 2x ‖
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము‖ 2x ఆనందమే ‖

Related Tags

PraiseWorshipThanksgiving