Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aanandame Prabhu Yesuni Sthuthinchuta Aathmaananda Geethame Paadedaa

ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతమే పాడెదా

Aanandame Prabhu Yesuni Sthuthinchuta Aathmaananda Geethame Paadedaa

Lyricist: Bro Yesanna
Chorus
ఆనందమే.... ప్రభు యేసుని స్తుతించుట -ఆత్మానంద గీతమే పాడెదా‖ 2x ‖
Verse
సిలువలో నాకై - రక్తము కార్చేను
సింహాసనమునకై - నన్నును పిలచెను‖ 2x ‖
సింహపు కోరల నుండి - నను విడిపించెను‖ 2x ‖
Verse
విశ్వాసమును - కాపాడుకొనుచు
విజయుడైన యేసుని - ముఖమును చూచుచు‖ 2x ‖
విలువైన కిరీటము - పొందెద నిశ్చయమే‖ 2x ‖
Verse
నా మానసవీణను - మ్రోగించగా
నా మనోనేత్రములందు - కనిపించె ప్రభురూపమే‖ 2x ‖
నా మదిలోన మెదిలేను - ప్రభు సప్తస్వరాలు‖ 2x ‖
Chorus
ఆనందమే.... ప్రభు యేసుని స్తుతించుట -ఆత్మానంద గీతమే పాడెదా‖ 2x ‖

Related Tags

PraiseWorshipJoy