Verse
ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను‖ 2x ‖
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను‖ 2x ఆనందము ‖
Verse
ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి‖ 2x ‖
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను‖ 2x ఆనందము ‖
Verse
అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె‖ 2x ‖
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్‖ 2x ఆనందము ‖
Verse
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్‖ 2x ‖
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్‖ 2x ఆనందము ‖