Verse
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్‖ 2x ‖
Verse
చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున‖ ఆనందముగా ‖
Verse
సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్‖ ఆనందముగా ‖
Verse
ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్‖ ఆనందముగా ‖
Verse
పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్‖ ఆనందముగా ‖