Chorus
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదను
Verse
చావు గోతినుండి లేవనెత్తి నాకు
జీవ మిచ్చిన జీవదాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున్
Verse
సింహపు పిల్లలు ఆకలిగొనును
యెహోవా సహాయుడందరికి
ఇహమందున ఏ మేలు కొదువయుండదు
ఆహా! ఏమందు నీ విశ్వాస్యతన్
Verse
ఎన్నెన్నో శోధన బాధలు రేగి
నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్నతండ్రీ నిన్ను కొనియాడెదన్
Verse
చావు చీకట్ల లోయలందున
జీవపు వెలుగై త్రోవ జూపి
దేవా తోడై నడిపించితివి నీ కృపన్
వివరించెదన్ నీ విశ్వాస్యతన్
Verse
నీతి న్యాయంబులు ఆధారములై
నీ సింహాసనమున నిలచినవి
నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్
నిరతంబు వెలసి నిలచినవి
Verse
పర్వతములు పారిపోయినను
ఉర్విలో మార్పు కలిగినను
తరుణములు విరోధముగా పై లేచిన
స్మరియించెద నీ విశ్వాస్యతన్