Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aanandinthu Neelo Devaa

ఆనందింతు నీలో దేవా

Aanandinthu Neelo Devaa

Lyricist: Hosanna Ministries
Verse
ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు‖ 2x ‖
మధురమైన నీ నామమునే‖ 2x ‖
మరువక ధ్యానించెద ప్రభువా‖ ఆనందింతు ‖
Verse
ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా‖ 2x ‖
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర‖ 2x ఆనందింతు ‖
Verse
నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా‖ 2x ‖
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన‖ 2x ఆనందింతు ‖
Verse
శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న‖ 2x ‖
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము‖ 2x ఆనందింతు ‖
Verse
శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ‖ 2x ‖
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి‖ 2x ఆనందింతు ‖

Related Tags

PraiseWorshipDevotional