Verse
ఆనందింతుము ఆనందింతుము
యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే‖ 2x ‖
గంతులేసి నాట్యమాడి
ఉత్సహించి పాడెదం‖ 2x ‖
యేసుని సన్నిధిలో ఆనందింతుము‖ 2x ఆనందింతుము ‖
Verse
భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ
దేవాది దేవుని తోడు మనకుండగా‖ 2x ‖
హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ‖ 2x ‖
యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం‖ 2x ఆనందింతుము ‖
Verse
నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ
నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా‖ 2x ‖
పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం‖ 2x ‖
యేసుని సన్నిధిలో పరవశించెదం‖ 2x ఆనందింతుము ‖
Verse
ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ
ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా!‖ 2x ‖
మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం‖ 2x ‖
యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం‖ 2x ఆనందింతుము ‖