Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aapathkaalamuna Naaku Aashrayamu

ఆపత్కాలమున నాకు ఆశ్రయము

Aapathkaalamuna Naaku Aashrayamu

Verse
ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే
అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే‖ 2x ‖
తల్లి కన్నా తండ్రి కన్నా
కాచిన దేవా నీకే స్తోత్రం‖ 2x ఆపత్కాలమున ‖
Verse
నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు
నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి‖ 2x ‖
ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు
భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు
ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు
నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా‖ ఆపత్కాలమున ‖
Verse
నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత
రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి‖ 2x ‖
మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ
చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ
నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై‖ 2x ఆపత్కాలమున ‖

Related Tags

PraiseComfortRefuge