Verse
ఆపత్కాలమున తన పర్ణశాలలో
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను
Verse
యెహోవా నా ప్రాణ దుర్గము
నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా
నేను భయపడను
Verse
ఇహలోక దుఃఖ బాధలలో
నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు
నన్ను ఎత్తుకొనే దేవుడవు
Verse
నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు
నిత్యము నీ పై ఆనుకొని
నిశ్చింతగా సాగేదన్ ఆ ...
హల్లెలూయ .... హల్లెలూయ
Verse
లెక్కించలేని అధ్భుతములు
మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై
నేను ఏమి అర్పింతును
Verse
స్వచ్ఛమైన నిత్య ప్రేమను
నాపై చూపినదేవుడవు
కొట్లా కొలది స్తోత్రములు
నిరతము నీకే ప్రభువా