Verse
ఆరాధన అందుకో‖ 2x ‖
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
Verse
అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా
మోషేతో అన్నావు ఉన్నానని‖ 2x ‖
అల్ఫయు నీవే ఓమెగయును‖ 2x ‖
ఆద్యంత రహితుండ నీవేనని
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
Verse
పాపంబున జన్మించి నశియించితిని
లోకంబు నాదనుచు ఆశించితిని‖ 2x ‖
అయినా నీవు రక్షణ నివ్వ‖ 2x ‖
వెలిగించి పంపితివి యేసు ప్రభును
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
Verse
తెలిసికొంటిని నా యేసు నిన్ను
సర్వ శక్తి గల ప్రభువనియు‖ 2x ‖
రానున్నావు మరలా నాకై‖ 2x ‖
ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో‖ ఆరాధన ‖