Verse
ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా యేసు అన్ని వేళలా‖ 2x ‖
నా కష్టాలలో ఆరాధన
శోక సంద్రములో నీకే ఆరాధన
నా నష్టాలలో ఆరాధన
లోకమే నను విడచినా నీకే ఆరాధన‖ ఆరాధనా ‖
Verse
ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా
ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన
నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా
నను విడువని యేసుని చూస్తూ ఆరాధన‖ 2x ‖
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన‖ 2x ఆరాధనా ‖
Verse
రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా
సర్వమును భరించు యేసుకే ఆరాధన
శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా
లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన‖ 2x ‖
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన‖ 2x ఆరాధనా ‖