Verse
ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా‖ 2x ‖
నీకే నా దేవా – తండ్రీ అందుకోవా‖ 2x ఆరాధనా ‖
Verse
అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా‖ 2x ‖
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా‖ 2x నీకే ‖
Verse
నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా‖ 2x ‖
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా‖ 2x నీకే ‖
Verse
అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా‖ 2x ‖
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా‖ 2x నీకే ‖