Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhanaku Yogyudaa

ఆరాధనకు యోగ్యుడా

Aaraadhanaku Yogyudaa

Lyricist: Jyothi Raju
Verse
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x ‖
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x ‖
Verse
దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే‖ 2x ‖
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x ‖
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x ‖
Verse
ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రత ననుభవించినావు‖ 2x ‖
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x ‖
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన‖ 2x ‖
ఆరాధన ఆరాధన‖ 2x ఆరాధనకు ‖

Related Tags

PraiseWorshipThanksgiving