Verse
పల్లవి: ఆరాధనలందుకో ఆరాధనలందుకో...
పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో‖ ఆరాధన ‖
Verse
పాపంబున జన్మించి నశియించితిని - లోకంబు నాదనుచు ఆశించితిని
ఆయినా నీవు రక్షణ నివ్వ - ప్రేమించి పంపితివి యేసు ప్రభుని
ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో‖ ఆరాధన ‖
Verse
తెలిసికొంటిని నా యేసు నిన్ను - సర్వ శక్తిగల ప్రభువనియు
రానున్నావూ మరల నాకై - ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో‖ ఆరాధన ‖
Verse
అంద సౌందర్యంబులు వ్యర్దమని - ఆశించితి ముత్యంబుగ నుండుటకై
నిన్నా నేడు నిరంతరము - మారని మా ప్రభూ నీకే స్తుతులు
ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో‖ ఆరాధన ‖