Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhimchedha Ninu Madhi Pogadedha Nirathamu Ninu Sthuthiyimchedhanu

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను

Aaraadhimchedha Ninu Madhi Pogadedha Nirathamu Ninu Sthuthiyimchedhanu

Verse 1
Reference: ఇల్లు అత్తరు వాసనతో నిండెను. యోహాను John 12:3
Chorus
ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను
మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రభువా
Verse
విస్తారంబగు - వ్యాపకములలో - విడచితి నీ సహవాసమును
సరిదిద్దితివి నా జీవితము - నిను సేవింపగా నేర్పిన ప్రభువా
Verse
నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెరిగితిని
నా కన్నీటితో నీ పాదములను - కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా
Verse
వ్యర్థపరచితిని నా సర్వమును - స్వార్థముతో జీవించితిని
గుర్తించితిని నీ త్యాగమును - వినయముతో నీ సన్నిధిచేరి
Verse
నీరక్తముతో నన్ను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి
నీరక్షణకై స్తోత్రము చేయుచు - నిత్యమునిన్ను కొనియాడెదను
Verse
దుర్గంధముతో నిండిన నన్ను - దయతో నీవు పిలిచితివి
ప్రేమతో పరమ విందు నొసంగి - ఆనందింపగ జేసిన ప్రభువా
Verse
ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిన్ను పూజింతు
నీ ప్రేమను నే నెనెగ తరమా - నా జీవితమున చాలిన ప్రభువా
Verse
పెద్దలు పరిశుద్దులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలచినను
లెక్కింపగ జాలని జనమందున - ననుగుర్తింతువు నా ప్రియ ప్రభువా

Related Tags

WorshipDevotional