Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhinchedamu Aathmatho Nirathamu

ఆరాధించెదము ఆత్మతో నిరతము

Aaraadhinchedamu Aathmatho Nirathamu

Verse
ఆరాధించెదము ఆత్మతో నిరతము
యెహోవా దేవుని మనమంతా
ఆనంద గానము మనసారా పాడుచు
అనుదినం కీర్తింతుము రారాజును‖ 2x ఆరాధించెదము ‖
Verse
అక్షయ నాథుడు అద్వితీయుడు
పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు‖ 2x ‖
ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు‖ 2x ‖
అమరుడై యున్నవాడు మన దేవుడు‖ 2x ఆరాధించెదము ‖
Verse
సత్య స్వరూపి మహోన్నతుడు
మహిమాన్వితుడు మనకును తండ్రియే‖ 2x ‖
ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు‖ 2x ‖
పరమందు ఆసీనుడు పూజార్హుడు‖ 2x ఆరాధించెదము ‖
Verse
సమస్తమునకు జీవాధారుడై
శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై‖ 2x ‖
భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు‖ 2x ‖
యుగములకు కర్తయే శ్రీమంతుడు‖ 2x ఆరాధించెదము ‖

Related Tags

PraiseWorship