Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aaraadhinchedanu Aatmathoa Nirathamu

ఆరాధించెదను ఆత్మతో నిరతము

Aaraadhinchedanu Aatmathoa Nirathamu

Lyricist: Raj Prakash Paul
Verse
ఆరాధించెదను ఆత్మతో నిరతము
ఆరాధ్య దైవమా ప్రభుయేసుని
ఆనంద గానమే మనసారా పాడుచు
అనుదినము స్తోత్రింతు నా యేసుని
నరరూపధారుడు పాపరహితుడు
మరణపు ముల్లును విరచిన విభుని
భజియించు స్తోత్రించి ఆరాధించెదను
అల్ఫా ఒమేగా నా యేసుడు
హల్లెలూయా అనుచు అర్పింతును నా హృదిని
భజియించి స్తోత్రించి మహిమపరచెదను
ఆరాధించెద ప్రభుని ఆత్మ సత్యములన్
అందరి ప్రభుడాయనే నా యేసుడు
పరలోక రాజ్యమును ధరయందు స్థాపింప
మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా
వరదూత ఘనములతో సమకూడి మనమంతా
స్తోత్రగీతములు పాడెదం మన రాజుకు

Related Tags

PraiseWorship