Verse
ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో‖ 2x ‖
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో‖ 2x ఆరాధించెదను ‖
Verse
నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె‖ 2x ‖
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను‖ 2x ఆరాధించెదను ‖
Verse
చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా‖ 2x ‖
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును‖ 2x ఆరాధించెదను ‖