Verse
ఆరాధించెదము ఆత్మతో సత్యముతో
కీర్తించెదము మా పూర్ణా హృదయముతో‖ 2x ‖
పరిశుద్ధుడా... పరిశుద్ధుడా...
మా స్వరముతో నిన్నే ఆరాధించేదం
పరిశుద్ధుడా... పరిశుద్ధుడా...
వేనోళ్లతో నిన్నే కీర్తించెదము
Verse
నీ చేతులతో చేసిన ఈ దేహముతో నిన్నే మహిమా పరచెదము
నీవు మాకు అనుగ్రహించిన ఈ ఆత్మతో నిన్నే కీర్తించెదము‖ 2x ‖
ఆరాధనీయుడవు అతికాంక్షణీయుడవు
మా స్తుతులకు పాత్రుడవు పరిశుద్దుడవు‖ 2x పరిశుద్ధుడా ‖
Verse
భూమి మీద అంతటను వ్యాపించి ఉన్నవాడ నీకే స్తోత్రము
సర్వజనుల అందరి నోటా కీర్తింపబడువాడా నీకే మహిమా‖ 2x ‖
వెలుగైయున్నవాడవు తేజోమయుడవు
మా స్తుతులపై ఆసీనుడవు పరిశుద్దుడవు‖ 2x పరిశుద్ధుడా ‖