Verse
ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును‖ 2x ‖
అత్యున్నత ప్రేమను కనుపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును‖ 2x ఆరాధ్యుడవు ‖
Verse
పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా‖ 2x ‖
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా‖ 2x ఆరాధ్యుడవు ‖
Verse
ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా‖ 2x ‖
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసెను‖ 2x ఆరాధ్యుడవు ‖
Verse
నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా‖ 2x ‖
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు‖ 2x ఆరాధ్యుడవు ‖