Verse
ఆరాధ్య దైవమా నా ప్రాణ దుర్గమా‖ 2x ‖
నీవేగా నా జీవనాధారము‖ 2x ‖
యెహెూవా యీరే యెహెూవా షమ్మా‖ 2x ‖
నీవేగా నా సమస్తము‖ 2x ‖
Verse
మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను పోషించుమయ్యా
పగలు మేఘమై రాత్రి అగ్నియై నన్ను కాపాడుమయ్యా‖ 2x ‖
నీ చేతి నీడలో నీ కనుచూపులో నన్ను దాయము నా యేసయ్యా‖ 2x ‖
Verse
అరణ్య యాత్రలో మార్గము నీవై నన్ను నడిపించుమయ్యా
మోడుబారిన జీవితాన్ని చిగురింప జేయుమయ్యా‖ 2x ‖
నీ కొరకే నే యిల ఫలియించెద నీ సాక్షిగ నే సాగెదనయ్యా‖ 2x ‖
Verse
నా ఎతైన కోటవు నీవే నీవే నా ఆశ్రయమయ్యా
రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకే స్తోత్రమయా
నన్ను విడువని నన్ను మరువని నా కాపరి నీవే నా యేసయ్యా‖ 2x ‖