Verse 1
ఆరంభమయ్యింది Restoration
నా జీవితంలోన New sensation
నేను పొగొట్టుకున్నవన్ని నా మేలు కోసం,నా ప్రభువు సమకూర్చి దీవించులే!
మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే!
Chorus
హే!మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration
కడవరి మందిర ఉనత మహిమే Restoration Restoration
Verse 3
హే!రెండంతలు,నాల్గంతలు,ఐదంతలు,
నూరంతలు,వెయ్యంతలు,ఊహలకు మించేటి
Verse
మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును
మా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను
అరె!సాయంకాలమున ఏడ్పు వచినను ఉదయం కలుగు
నోట నువ్వు పుట్టును,మాకు వెలుగు కలుగును
ధు:ఖము ంట్టూర్పు ఎగగొట్టి ప్రభువు మమ్మాదరించును
కీదు తొలగజేయును,మేలు కలుగజేయును
Verse
మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపును
చేడపురుగులెన్నియొ తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చును
అరె!నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను
అది తప్పక జరుగును,కదవరి వర్షమొచ్చును
క్రొత్తద్రాక్షారసము,అహా!మంచి ధాన్యములతో మా కొట్లు నింపును
క్రొత్తతైలమిచ్చును,మా కొరత తీర్చును
Verse
పక్షిరాజు వలెను మా యౌవ్వనమును
ప్రభు నిత్యనూతనం చేయును
మేం కోల్పోయిన యౌవన దినములను
మరలా రెట్టింపుగా మాకిచ్చును
అరె!వంద ఏళ్ళూయినా,మా బలము ఉడగకుండా సారమిచ్చును
జీవ ఊటనిచ్చును,జీవ జలములిచ్చును
సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చును
ఆత్మవాక్కులిచ్చును,మంచి దృష్టినిచ్చును
Verse
మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన
మా సొత్తు మాకు విడిపించును
మోసకారి మోసము మేము తిప్పికొట్టను
ఆత్మ జ్ఞానముతో మము నింపును
అరె!అంఢకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో
మమ్ము గొప్పజేయును,దొంగ దిమ్మ తిరుగును
దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును
మహిమ కుమ్మరించును,మెప్పు ఘనతలిచ్చును
Verse
మా జీవితాలలో దైవ చిత్తమంతయూ
మేము చేయునత్లు కృపనిచ్చును
సర్వలోకమతట సిలువ వార్త చాట్ను
గొప్ప ద్వారములు ప్రభు తెరచును
అరె!అపవాది క్రియలు మేం లయము చేయునట్ట్లు అభిషేకమిచ్చును
ఆత్మ రోషమిచ్చును,కొత్త ఊపు తెచ్చును
మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును
సత్యబోధనిచ్చును,రాజ్య మర్మమిచ్చును