Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aarani Prema Idi

ఆరని ప్రేమ ఇది

Aarani Prema Idi

Lyricist: Amshumathi Mary
Verse
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది‖ 2x ‖
అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది‖ 2x ‖
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది‖ 2x Aarani ‖
Verse
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది‖ 2x ‖
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది‖ 2x ‖
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది‖ 2x Aarani ‖
Verse
నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది‖ 2x ‖
నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది‖ 2x ‖
ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది‖ 2x Aarani ‖
Verse
భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన‖ 2x ‖
ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు‖ 2x ‖
ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది‖ 2x Aarani ‖

Related Tags

PraiseCalvaryLove