Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aarani Prema Idi Aarpajaalani Jwaala Idi

ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది

Aarani Prema Idi Aarpajaalani Jwaala Idi

Verse
పల్లవి : ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది
అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది
Verse
సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది
ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది
Verse
నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి
క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది
ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది
Verse
భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు
చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా
ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు
ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది

Related Tags

SalvationLove Of GodCalvary