Chorus
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద
ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది
Verse
ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే‖ 2x ‖
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥‖ 2x ఆశ్చర్యకరుడా ‖
Verse
ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే‖ 2x ‖
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥‖ 2x ఆశ్చర్యకరుడా ‖
Verse
యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను‖ 2x ‖
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥‖ 2x ఆశ్చర్యకరుడా ‖