Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aascharyakarudu

ఆశ్చర్యకరుడు

Aascharyakarudu

Lyricist: Joel Kodali
Verse
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన పునరుద్ధానుడు
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము‖ ఆరాధించెదము ‖
Chorus
ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Verse
సత్య స్వరూపి సర్వాంతర్యామి
సర్వాధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన
మహిమా గలవాడు మహా దేవుడు
Verse
రండి మనమందరము – ఉత్సాహగానములతో
ఆ దేవ దేవుని – ఆరాధించెదము‖ ఆరాధించెదము ‖
Chorus
ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

Related Tags

PraiseWorship