Verse
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త‖ 2x ‖
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో‖ 2x ఆశ్చర్యకరుడు ‖
Verse
తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను‖ 2x ‖
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు
నీటిపై ఠీవిగా నడచినవాడతడు‖ 2x ఆశ్చర్యకరుడు ‖
Verse
మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు‖ 2x ‖
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు‖ 2x ఆశ్చర్యకరుడు ‖