Verse
ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ‖ 2x ‖
Verse
పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ‖ 2x ‖
నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చే‖ 2x ఆశ్చర్య ‖
Verse
పావన యేసుని ప్రేమ - సిలువలొ పాపిని మోసిన ప్రేమ‖ 2x ‖
నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే‖ 2x ఆశ్చర్య ‖
Verse
శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ‖ 2x ‖
విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు‖ 2x ఆశ్చర్య ‖
Verse
నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ‖ 2x ‖
నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే‖ 2x ఆశ్చర్య ‖