Verse
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆత్మతో సత్యముతో స్తుతించెదను
ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము‖ ఆశ ‖
Verse
దుప్పి నీటికై ఆశపడునట్లుగా
దేవుని కొరకై ఆశ పడుచున్నాను
దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా‖ 2x ‖
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను‖ ఎంత ‖
Verse
లోక ఆశలు లయమైపోవును
లోకులెవ్వరు కాపాడలేరు
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం‖ 2x ‖
లోబడు వారిని పారమున చేర్చును‖ ఎంత ‖