Chorus
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా
ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా
మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా‖ ఆశపడకు ‖
Verse
ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా
దేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా‖ 2x ‖
వెండి బంగారు వెలగల వస్త్రం
పరిమళ పుష్ప సుగంధములు‖ 2x ‖
మట్టిలోనుండి వచ్చినవేనని
మరువబోకు నా చెల్లెమ్మా‖ 2x ఆశపడకు ‖
Verse
అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మా
పంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా‖ 2x ‖
అందమైన ఆ దీనా షెకెములు
హద్దులేక ఏమయ్యిందమ్మా‖ 2x ‖
అంతరంగమున గుణముకలిగిన
శారా చరిత్రకెక్కిందమ్మా‖ 2x ఆశపడకు ‖
Verse
జాతి కొరకు ఉపవాస దీక్షతో – పోరాడిన ఎస్తేరు రాణిలా
నీతి కొరకు తన అత్తను విడువక – హత్తుకున్న రూతమ్మ ప్రేమలా‖ 2x ‖
కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి
తన కురులతో తుడిచిన మగ్దలీనలా‖ 2x ‖
హన్నా వలె మన దోర్కా వలె
ప్రిస్కిల్ల వోలె విశ్వాస వనితలా‖ 2x ‖
వారి దీక్షయే వారసత్వమై
అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై‖ 2x ‖
పవిత్రమైన హృదయము కలిగి
ప్రభువు కొరకు జీవించాలమ్మా‖ 2x ఆశపడకు ‖