Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aashatho Nee Koraku Eduru Choochuchundagaa

ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా

Aashatho Nee Koraku Eduru Choochuchundagaa

Verse
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
నూతన బలముతో నను నింపినావు‖ 2x ‖
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా‖ 2x ‖
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన‖ 2x ఆశతో ‖
Verse
సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా‖ 2x ‖
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట‖ 2x యేసయ్యా ‖
Verse
అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై‖ 2x ‖
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో‖ 2x ‖
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత‖ 2x యేసయ్యా ‖

Related Tags

WorshipHopeStrength