Verse 1
Reference: యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది. కీర్తన Psalm 36:10
Chorus
ఆశ్చర్యకరుడ వీవే - యెహోవా నీవే ధన్యుడవు
Verse
నీ కృప నింగినంటెను
వచ్చినవారే దయ పొందెదరు - నీవే దయాళుడవు‖ నీవే దయాళుడవు ‖
Verse
నీ విశ్వాస్యత గొప్పది
ఉన్నతమైనది అందరి యెడల - ఎన్నడు మారనిది‖ ఎన్నడు మారనిది ‖
Verse
నీ నీతి స్థిరమైనది
పరిశీలించెదవు యెల్ల ప్రజలను - సరిదిద్దువాడ వీవే‖ సరిదిద్దువాడ వీవే ‖
Verse
అమూల్యము నీ కరుణ
వచ్చినవారికి ఆశ్రయమిచ్చి - రెక్కలతో కప్పెదవు‖ రెక్కలతో కప్పెదవు ‖
Verse
నీ యింట తృప్తిగలదు
ఆనంద జలములను త్రాగనిచ్చెదవు - నీ ప్రజలందరికి‖ నీ ప్రజలందరికి ‖
Verse
నీ ప్రకాశము నిలుచు
నిన్నెరిగియున్న వారిపై నిరతం - మెండైన కృపనిత్తువు‖ మెండైన కృపనిత్తువు ‖