Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aasheervaadambul Maa Meeda

ఆశీర్వాదంబుల్ మా మీద

Aasheervaadambul Maa Meeda

Verse
ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము
Chorus
ఇమ్మాహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా
Verse
ఓ దేవా పంపింపవయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్‖ ఇమ్మాహి ‖
Verse
మా మీద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద
క్షామంబు పోనట్లుగన్‖ ఇమ్మాహి ‖
Verse
ఈనాడే వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి బ్రౌర్ధింతుము‖ ఇమ్మాహి ‖

Related Tags

WorshipPrayerBlessing