Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aashinchumu Prabhu Yesu Paadamulanu

ఆశించుము ప్రభు యేసు పాదములను

Aashinchumu Prabhu Yesu Paadamulanu

Verse
ఆశించుము ప్రభు - యేసు పాదములను
వాసిగ పాపుల - కాశ్రయములవి
Verse
యేసుని కీర్తిని కొనియాడెదము
యేసుని ప్రేమ చాటించెదము
యేసుని నామంబే మన జయము
Verse
యేసే ప్రేమ యేసే రక్షణ
యేసే జ్యోతి యేసే జీవం
యేసు ప్రభువునకే స్తుతియు మహిమ
Verse
సుజనుండేసుని భజనలు చేసి
నిరతంబాయన స్మరణము జేసి
ధన్యుండేసే యని పాడుమా
Verse
సార్వత్రికము తన సృష్టియే
తన వారికి కృపానిధియే
తన ప్రేమను మరువగ బోకు
Verse
యేసుని పాదముల చేరి స్తుతించు
ఆత్మ ప్రాణ శరీ-రము నర్పించు
యేసుని నీదు ప్రభువుగా నెంచి

Related Tags

WorshipDevotionalJesus