Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aashrayadurgamaa Naa Yesayyaa

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా

Aashrayadurgamaa Naa Yesayyaa

Verse
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే‖ ఆశ్రయ ‖
Verse
లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే‖ 2x ‖
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి‖ 2x ఆశ్రయ ‖
Verse
నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే‖ 2x ‖
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి‖ 2x ఆశ్రయ ‖
Verse
పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద‖ 2x ‖
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి‖ 2x ఆశ్రయ ‖
Verse
నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది‖ 2x ‖
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా‖ 2x ఆశ్రయ ‖

Related Tags

WorshipJesusRefuge