Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aashrayam Neeve Yesayya Aadharam Neeve Messayya

ఆశ్రయం నీవే యేసయ్యా ఆధారం నీవే మెస్సయ్యా

Aashrayam Neeve Yesayya Aadharam Neeve Messayya

Lyricist: Bro N Pradeep Reddy
Verse
ఆశ్రయం నీవే యేసయ్యా
ఆధారం నీవే మెస్సయ్యా
బలమైన కోటవు నీవెగా
Alpha Omega నీవయ్యా
Chorus
పాడెదము స్తుతి గానము
చేసెదము స్తోత్రార్పణము‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
స్తోత్రము స్తుతి స్తోత్రము‖ 2x ఆశ్రయం నీవే ‖
Verse
యుద్ధములలో నాతో ఉంటివి
శత్రువులపై జయము నిచ్చితివి‖ 2x ‖
నా జయధ్వజము నీవెగా
యెహోవా నిస్సీ - నా జయము‖ 2x హల్లెలూయా ‖
Verse
అక్కరలలో నాకు సహాయము
శ్రమలలో నాకు ఓదార్పు‖ 2x ‖
నా పోషణాధారము నీవెగా
యెహోవా యీరే - నా సమృద్ధి‖ 2x హల్లెలూయా ‖
Verse
నా రోగములను బాగు చేసితివి
బలహీనతలో బలము ఇచ్చితివి‖ 2x ‖
పరమ వైద్యుడవు నీవెగా
యెహోవా రాఫా - నా స్వస్థత‖ 2x హల్లెలూయా ‖
Verse
కలతలలో నాకు నెమ్మది
బాధలలో నాకు ఆదరణ‖ 2x ‖
నా సమాధానము నీవెగా
యెహోవా షాలోం - నా శాంతి‖ 2x హల్లెలూయా ‖

Related Tags

PraiseWorship