Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aashrayamaa Aadhaaramaa

ఆశ్రయమా ఆధారమా

Aashrayamaa Aadhaaramaa

Lyricist: K Y Ratnam
Verse
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా‖ 2x ‖
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను‖ 2x ఆశ్రయమా ‖
Verse
కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను‖ 2x ‖
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు‖ 2x ఆశ్రయమా ‖
Verse
భక్తిహీనులు నాపై పొర్లిపడినను
శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను‖ 2x ‖
నా వెంటే నీవుండినావు
కాపాడి రక్షించినావు‖ 2x ఆశ్రయమా ‖
Verse
మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను‖ 2x ‖
నా వెంటే నీవుండినావు
దయచూపి దీవించినావు‖ 2x ఆశ్రయమా ‖

Related Tags

PraiseWorshipRefuge