Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aashrayudaa Naa Abhishikthudaa

ఆశ్రయుడా నా అభిషిక్తుడా

Aashrayudaa Naa Abhishikthudaa

Lyricist: Deevenaiah
Verse
ఆశ్రయుడా నా అభిషిక్తుడా
నీ అభీష్టము చేత నను నడుపుచుండిన
అద్భుత నా నాయకా
యేసయ్య అద్భుత నా నాయకా
Verse
స్తోత్రములు నీకే స్తోత్రములు‖ 2x ‖
తేజోమయుడయిన ఆరాధ్యుడా‖ 2x ‖
Verse
నీ ఆలోచనలు అతి గంభీరములు
అవి ఎన్నటికీ క్షేమకరములే
మనోహరములే కృపాయుతమే‖ 2x ‖
శాంతి జలములే సీయోను త్రోవలు‖ 2x ‖
Verse
నీతి మార్గములో నన్ను నడుపుచుండగా
సూర్యుని వలె నే తేజరిల్లెదను
నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై‖ 2x ‖
జీవించెదను నీ సముఖములో‖ 2x ‖
Verse
సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి
ఆత్మల రక్షణ నా గురి చేసితివి
పరిశుద్ధతలో నే నడిచెదను‖ 2x ‖
భళా మంచి దాసుడనై నీ సేవలో‖ 2x ‖

Related Tags

PraiseWorshipDevotional