Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aathma Shrungarinchu Kommu Paapa Ga

ఆత్మ శృంగారించు కొమ్ము పాప గ

Aathma Shrungarinchu Kommu Paapa Ga

Lyricist: J Frank
Verse
ఆత్మ! శృంగారించు కొమ్ము
పాప గుహ వీడి పొమ్ము
వెల్గులోని కింకరమ్ము
తేజరిల్లు మీ దినము
"రక్షణాధి కారవిందు
నీకు జేయ బోవుముందు
భూదినంబు లేలు ఱేడు
నిన్ను జేర వచ్చు నేడు"
Verse
పెండ్లి కూతురెట్లు భర్త
నట్లు ప్రేమ జూపుకర్త
నాయ నెంతో జాలిగుండె
తోడ దల్పు దట్టు చుండె
"నా ప్రియుండ! వేగరమ్ము
ముద్దు బెట్ట నిమ్ము నన్ను"
అందు హృదయంబుతోడ
యేసునాద నాహ్వానించు.
Verse
శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు
జేయ గొండ్రు బల్ధనంబు
సర్వ శ్రేష్ఠమౌ వరంబు
లిచ్చు చుంటి యుచితంబు
కాకయున్న నీ శరీర
రక్తముల్గొనంగ నీర
రాసులైన గనులైన
జాలునా మరేవియైన?
Verse
నిశ్చలంపు బ్రేమ నిన్ను
చీల్చి భూమికంటె నన్ను
మాకునైత్వదీయ ప్రాణ
మిచ్చినాడ వట్లు గాన‖ Amen ‖
చిందబడ్డ నీ శరీర
రక్త బిందు లింపుమీర
రాత్రి భోజనాన మాక
నంత ప్రేమ పెంచుగాక
Verse
యేసు! జీవ భక్తమైన
నీదు బల్ల గంటినైన
వ్యర్థ నష్టతల్ల భింప
నీకు, దీననే నశింప
భూమి మీద బోలె మింట
నిన్ను గూడి త్రాగి తింటి
కీసు భోజనంబు నందు
నీదు ప్రేమ జూపుమందు,

Related Tags

WorshipDevotionalChristian