Verse
ఆత్మ వర్షము మాపై కురిపించుము
కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము‖ 2x ‖
నీ ఆత్మతో సంధించుము
అభిషేకంతో నింపుము
నీ అగ్నిలో మండించుము
వరాలతో నింపుము‖ 2x ఆత్మ ‖
Verse
యెషయా పెదవులు కాల్చితివి
సేవకు నీవు పిలచితివి‖ 4x ‖
సౌలును పౌలుగా మార్చితివి
ఆత్మ నేత్రములు తెరచితివి‖ 2x ‖
మమునూ వెలిగించుము
మా పెదవులు కాల్చుము‖ 2x ఆత్మ ‖
Verse
పాత్మజు దీవిలో పరవశుడై
శక్తిని చూచెను యోహాను‖ 2x ‖
షడ్రకు మేషకు అబేద్నగో
ధైర్యముతో నిను సేవించిరి‖ 2x ‖
మామునూ రగిలించుము
మాకు దర్శనమిమ్ము‖ 2x ఆత్మ ‖