Verse
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది‖ 2x ‖
Verse
దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు‖ 2x ‖
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు‖ 2x ఆత్మ ‖
Verse
నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు‖ 2x ‖
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు‖ 2x ఆత్మ ‖
Verse
హృదయ శుద్ధి గలవారు ధన్యులు
వారు దేవుని చూచెదరు‖ 2x ‖
సమాధాన పరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు‖ 2x ఆత్మ ‖