Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aathmalanu Sampaadimpaga Nagu Aathma Balama

ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమ

Aathmalanu Sampaadimpaga Nagu Aathma Balama

Lyricist: Mallela David
Chorus
ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ
సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప
నాత్మల కాపరి యాన తిడి‖ ఆత్మలను ‖
Verse
ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి
మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు‖ ఆత్మలను ‖
Verse
క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో
ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా‖ ఆత్మలను ‖
Verse
పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ
డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు‖ ఆత్మలను ‖
Verse
నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ
ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక‖ ఆత్మలను ‖
Verse
జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను
గడింప నీతి మహిమ మకుటంబులునౌ‖ ఆత్మలను ‖
Verse
నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు
విభుని సేవకు నీ వర్పించు‖ ఆత్మలను ‖

Related Tags

EvangelismServiceSoul Winning