Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aathmeeya Gaanaalatho

ఆత్మీయ గానాలతో

Aathmeeya Gaanaalatho

Verse
ఆత్మీయ గానాలతో
నిన్నే ఆరాధన చేయనా
స్తుతి స్తోత్ర గీతాలతో
నీ నామము పూజించనా‖ 2x ‖
మహిమ ఘనత ప్రభావములు
నీకే చెల్లించుచున్నానయ్యా‖ 2x ‖
ఆరాధించనా నీ పాద సన్నిధి‖ 2x ‖
స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా
ఆరాధనా నీకే ఆరాధనా‖ 2x ఆత్మీయ ‖
సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధుడా‖ 2x ‖
కెరూబులు సెరాపులు‖ 2x ‖
దీవా రాత్రులు నీ సన్నిధిలో‖ 2x ‖
స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా‖ 2x స్తుతి పాత్రుడా ‖
అందరిలోను అతి శ్రేష్టుడా
వేల్పులలోన మహనీయుడా‖ 2x ‖
పూజార్హుడా స్తోత్రార్హుడా‖ 2x ‖
అతి సుందరుడా మనోహరుడా‖ 2x ‖
చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో‖ 2x స్తుతి పాత్రుడా ‖
అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా
అపరంజిని పోలిన పాదాలు గలవాడా‖ 2x ‖
(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన‖ 2x ‖
స్వరమును కలిగిన ఘననీయుడా‖ 2x ‖
శిరము వంచనా సర్వోన్నతుడా‖ 2x స్తుతి పాత్రుడా ‖

Related Tags

PraiseWorship