Chorus
ఆత్మ దీపమును - వెలిగించు
యేసు ప్రభో - ఆత్మ దీపమును
Verse
మార్గంబంతయు చీకటిమయము
స్వర్గ నగరికి మార్గంబెటులో
సదయా నీవే నను పట్టుకొని
సరిగా నడుపుము ప్రేమ పథమున
Verse
వసియించుము నా హృదయమునందు
వసియించు నా నయనములందు
అన్నియు నిర్వహించు చున్నావు
నన్నును నిర్వహించుము ప్రభువా
Verse
కలుషాత్ములకై ప్రాణముబెట్టి
కష్టములంతరింప జేసి
కల్వరి సిలువలో కార్చిన రక్త
కాలువయందు కడుగుము నన్ను